![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -650 లో.. జ్యోత్స్న కిడ్నాప్ అయిందని తెలిసి సుమిత్ర షాక్ అవుతుంది. నా కూతురు నాకు కావాలని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. జ్యోత్స్నకి ఏం కాదు అమ్మ అని దీప అనగానే నువ్వు ముందు ఇంట్లో నుండి వెళ్ళవే.. నా కూతురు అంటే నీకు ఇష్టం లేదు.. మొన్న ఫోన్ లో ఎలా మాట్లాడావ్.. అసలు నా కూతురు నిన్ను ఇంట్లోకి తీసుకొని రాకుంటే ఇదంతా జరిగేది కాదని దీపను సుమిత్ర బయటకు గెంటేయ్యబోతుంటే అప్పుడే కార్తీక్ అడ్డుపడుతాడు.
అత్త ఏం చేస్తున్నావని కార్తీక్ అంటాడు. వెళ్లి నా కూతురిని తీసుకొని రారా అని సుమిత్ర ఏడుస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు అత్త అని కార్తీక్ అంటాడు. అప్పుడే పోలీసులని తీసుకొని దాస్ ఇంటికి వస్తాడు. జ్యోత్స్నని కిడ్నాప్ చేసారంట కదా అని అందుకే పోలీసులని తీసుకొని వచ్చానని దాస్ అంటాడు. ఇన్‌స్పెక్టర్ గారు మీరు బయట ఉండండి నేను వస్తానని శివన్నారాయణని బయటకు పంపిస్తాడు. అసలు నువ్వు ఎవడవురా పోలీసులని తీసుకొని రావడానికి ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా అని దాస్ పై శివన్నారాయణ కోప్పడతాడు. పోలీసులకి చెప్తే జ్యోత్స్నని చంపేస్తామని బెదిరించారని సుమిత్ర అంటుంది. ఆ విషయం నాకు తెలియదు కదా వదిన అని దాస్ అంటాడు. మరొకవైపు డబ్బులు ఏర్పాటు చేసారా అని దశరత్ కి వైరా ఫోన్ చేసి మాట్లాడతాడు. అక్కడ జ్యోత్స్న గురించి తెలుసుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ అక్కడే ఉంటాడు. ఎక్కువ సేపు మాట్లాడండి ఫోన్ ట్రాక్ చేస్తామని ఆఫీసర్ అంటాడు. వైరాకి విషయం అర్ధం అయి పక్కన పోలీసులు ఉన్నారని అర్థం అవుతుంది. పోలీసులకి చెప్తే ఏం చేస్తానో తెలిసి కూడా మళ్ళీ దైర్యం చేశారా అని వైరా ఫోన్ కట్ చేస్తాడు. అక్కడ పోలీసులు ఉన్నారని నీకెలా తెలుసని జ్యోత్స్న అంటుంది. మీ డాడీ మాటల్లో కాన్ఫిడెన్స్ అనిపించిందని వైరా అంటాడు. జ్యోత్స్నకి టైం టు టైం ఫుడ్ ఏర్పాటు చేస్తారు.
మరొకవైపు ఆ డబ్బులు ఏవో ఏర్పాటు చెయ్యండి అని సుమిత్ర అంటుంది. అమ్మ టాబ్లెట్ వేసుకునే టైమ్ అయిందని దీప అంటుంది. నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు దీప అని సుమిత్ర అంటుంది. దాంతో దీపని తీసుకొని శ్రీధర్ ఇంటికి బయల్దేరతాడు. అక్కడ ఇంటికి వెళ్లేసరికి కాంచన టెన్షన్ పడుతుంది. జరిగింది మొత్తం శ్రీధర్ చెప్తాడు. కార్తీక్ తో పాటు నువ్వు కూడా అక్కడే ఉండాల్సింది దీప అని కాంచన అనగానే మొన్న దీప ఫోన్ లో మాట్లాడిన మాటలు చెల్లి మనసులో పెట్టుకొని దీపని అక్కడ నుండి వెళ్ళమంది అని శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..
![]() |
![]() |